బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ తన కొత్త సినిమా ‘కేసరి చాప్టర్ 2’తో సిద్ధమవుతున్నారు. ఈ సినిమాలో జలియన్ వాలాబాగ్ ఊచకోత తర్వాత బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడిన న్యాయవాది శంకర్ నాయర్‌గా కనిపించనున్నారు. తాజాగా హరియాణా పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ శంకర్ నాయర్ గురించి మాట్లాడడంతో అక్షయ్ ఆనందం వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు తెలిపారు. మోదీ స్పీచ్‌కు సంబంధించిన వీడియోను అక్షయ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
“శంకర్ నాయర్ గొప్ప విలువలు కలిగిన న్యాయవాది, జలియన్ వాలాబాగ్ ఊచకోతపై బ్రిటిష్ ప్రభుత్వ పునాదులను కదిలించారు,” అని మోదీ తన స్పీచ్‌లో గుర్తుచేశారు.
కరణ్ సింగ్ త్యాగి దర్శకత్వంలో తెరకెక్కిన ‘కేసరి చాప్టర్ 2’ ఏప్రిల్ 18న విడుదల కానుంది. ఈ సినిమా ద్వారా శంకర్ నాయర్ లాంటి వీరుల స్ఫూర్తిని యువతకు చేరవేయాలని అక్షయ్ భావిస్తున్నారు. బ్రిటిష్ ప్రభుత్వం, కింగ్ చార్లెస్ ఈ చిత్రాన్ని చూసి తమ తప్పును గుర్తించి క్షమాపణ చెప్పాలని అక్షయ్ కోరారు. “మన కోసం ధైర్యంగా పోరాడిన హీరోలను గౌరవించడం మన బాధ్యత. ‘కేసరి చాప్టర్ 2’ అలాంటి ప్రయత్నమే,” అని అక్షయ్ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.





