
రాజ్ కపూర్ 100వ పుట్టినరోజు సందర్బంగా ప్రధాని నరేంద్ర మోడి బాలీవుడ్ కపూర్ కుటుంబంతో కొంత సమయం గడిపారు. ఈ సందర్భంగా అలియా భట్ మోదీతో ముచ్చటించింది. అంతేకాదు.. సంగీతం గురించి మాట్లాడుతూ.. ‘మోదీ జీ మీరు ఆఫ్రికా పర్యటనలో ఉన్నప్పుడు.. జవాన్ తో కలిసి ఓ పాట పాడడం నేను చూశాను. మీరు నాా పాటే పాడుతున్నారు?’ అనగానే సమావేశ మందిరంలో నవ్వులు విరిశాయి. “మీకు సంగీతం వినే సమయం ఉంటుందా?” అని మోదీని అలియా అడిగింది. ప్రధాని మోదీ నవ్వుతూ… ‘అప్పుడప్పుడు సమయం చిక్కినప్పుడల్లా వింటుంటాను..’ అని బదులిచ్చారు. రన్‌బిర్ కపూర్ మాట్లాడుతూ, “మా కుటుంబానికి ఇది ప్రత్యేకమైన రోజు. PM మాకు, రాజ్ కపూర్ గారికి గౌరవం ఇచ్చారు” అని తెలిపారు.





