సినీనటుడు అల్లు అర్జున్ (Allu Arjun) చిక్కడపల్లి పోలీసుల విచారణకు మంగళవారం ఉదయం హాజరయ్యారు. ఆయన తన నివాసం నుంచి బయలుదేరి, తండ్రి అల్లు అరవింద్, మామ చంద్రశేఖర్‌రెడ్డి, నిర్మాత బన్నీ వాసుతో కలిసి చిక్కడపల్లి పోలీసు స్టేషన్‌కు చేరుకున్నారు. సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటనతో సంబంధించి పోలీసులు ఈ విచారణ చేపట్టారు. ఈ ఘటనలో ఒక మహిళ మరణించి, ఆమె కుమారుడు గాయపడ్డారు. అల్లు అర్జున్ వివరణ ఇవ్వాలని, అలాగే ఆయన ప్రెస్‌మీట్‌పై కూడా ప్రశ్నించొచ్చని సమాచారం. ఈ నేపథ్యంలో ఆయన తన లీగల్ టీమ్‌తో ఈ నోటీసులపై చర్చలు జరిపారు. అర్జున్ రాక కారణంగా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేయబడింది. వాహనాల రాకపోకలను నియంత్రించారు.





