సైమా వేదికగా ‘పుష్ప 2’ రికార్డు.. ‘పుష్ప 3’పై సుకుమార్ క్లారిటీ!

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్‌బస్టర్ సినిమా ‘పుష్ప’. ఈ సినిమా ఇప్పుడు దుబాయ్‌లో జరిగిన ‘సౌత్ ఇండియన్ ఇంటర్నేషియల్ మూవీ అవార్డ్స్’ (సైమా)లో సత్తా చాటింది. ‘పుష్ప 2’ అత్యధిక నామినేషన్లు దక్కించుకుని, ఏకంగా ఐదు విభాగాల్లో అవార్డులు గెలుచుకుంది.

ఏయే విభాగాల్లో అవార్డులు?

‘పుష్ప 2’కు అవార్డులు దక్కిన విభాగాలు:

  • ఉత్తమ నటుడు: అల్లు అర్జున్
  • ఉత్తమ నటి: రష్మిక
  • ఉత్తమ దర్శకుడు: సుకుమార్
  • ఉత్తమ సంగీత దర్శకుడు: దేవి శ్రీప్రసాద్
  • ఉత్తమ గాయకుడు: శంకర్ బాబు

‘పుష్ప 3’ వస్తుందా?

‘పుష్ప 3: ది ర్యాంపేజ్’ పేరుతో మూడో భాగం రానుందనే పోస్టర్ గతంలో విడుదలైనప్పటికీ, ఆ తర్వాత ఎలాంటి అప్‌డేట్ లేదు. దీంతో అభిమానుల్లో గందరగోళం నెలకొంది. అయితే, సైమా అవార్డుల వేదికగా ఈ సందేహాలకు దర్శకుడు సుకుమార్ క్లారిటీ ఇచ్చారు. వ్యాఖ్యాత అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ, “పుష్ప 3 కచ్చితంగా ఉంటుంది” అని చెప్పారు. దీంతో అల్లు అర్జున్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మీ బిజినెస్ ని ఇక్కడ ప్రమోట్ చేస్కోండి !

Your Ads Here (365 x 270 area)
Breaking News
కేటగిరి

మా న్యూస్ అప్డేట్లు కోసం సబ్‌స్క్రైబ్ చేయండి!

Everyday we discover real news for you.