- అమరావతి రాజధానికి బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికైన వైద్య విద్యార్థిని అంబుల వైష్ణవి సీఎం చంద్రబాబుని కలిశారు.
- అమరావతి అభివృద్ధికి విరాళాలు సేకరించాలన్నది తన లక్ష్యమని వైష్ణవి సీఎంకు వివరించారు.
చిన్న వయసులోనే అంబాసిడర్‌గా ఎంపికైన వైష్ణవిని అభినందించిన సీఎం, యువత రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములై ప్రగతి దిశగా నడవాలని సూచించారు. అమరావతి భవిష్యత్తు కోసం వైష్ణవి చూపుతున్న ఉత్సాహం, సామాజిక బాధ్యత తన తరహాలో ప్రత్యేకమని పేర్కొన్నారు. గతంలోనూ ఆమె పలుమార్లు రాజధానికి విరాళాలు అందించిందని, 2019కి ముందు 25 లక్షలు, గతేడాది జూన్‌లో మరో 25 లక్షలు విరాళంగా ఇచ్చిందని గుర్తుచేశారు. రాజధాని అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని చంద్రబాబు సూచించారు.





