- రూ. 2.9 కోట్ల విలువైన 1,183 సెల్‌ఫోన్లను బాధితులకు అప్పగించిన అనంతపురం పోలీసులు
- 2022 నుంచి మొత్తం 11,378 ఫోన్లు రికవరీ – 21.08 కోట్ల విలువ
అనంతపురం జిల్లా పోలీసులు చాట్‌బాట్ ప్రత్యేక యాప్ ద్వారా చోరీ అయిన, పోయిన సెల్‌ఫోన్లను గుర్తించి బాధితులకు అప్పగిస్తున్నారు. శుక్రవారం ఎస్పీ జగదీశ్ ఆధ్వర్యంలో 1,183 మందికి రూ.2.9 కోట్ల విలువైన ఫోన్లు పంపిణీ చేశారు. 2022 నుంచి ఇప్పటి వరకు 11,378 ఫోన్లు రికవరీ చేయగా, వీటి మొత్తం విలువ రూ.21.08 కోట్లు అని ఎస్పీ వెల్లడించారు. ఫోన్లను తిరిగి పొందినవారిలో అనంతపురం జిల్లాలో 7,512 మంది, శ్రీసత్యసాయి, కర్నూలు, కడప, చిత్తూరు, గుంటూరు జిల్లాల ప్రజలతో పాటు కర్ణాటక, తెలంగాణ, కేరళ, మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, అస్సాం వంటి రాష్ట్రాల ప్రజలు కూడా ఉన్నారు. ఎస్పీ ప్రజలను సెకెండ్ హ్యాండ్ ఫోన్లు కొనేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, దొంగ ఫోన్లను కొనుగోలు చేస్తే కఠిన చర్యలు ఎదురవుతాయని హెచ్చరించారు.





