- ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించిన అసెంబ్లీ
- కేంద్రానికి పంపేందుకు సిద్ధమన్న సీఎం చంద్రబాబు
ఏపీ శాసనసభ బుధవారం బుడగజంగం కులాన్ని ఎస్సీ జాబితాలో చేర్చాలని ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఎస్సీ వర్గీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. జిల్లాల వారీగా కేటగిరీల విభజనపై మరోసారి సమీక్ష జరిపేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
ఎస్సీ వర్గీకరణలో టీడీపీ పాత్ర
1996లోనే ఎస్సీల వర్గీకరణ కోసం కమిటీ వేయించిన ఘనత టీడీపీదేనని చంద్రబాబు గుర్తు చేశారు. పేదలకు న్యాయం చేయడం తన జీవిత ప్రయాణమని పేర్కొన్న ఆయన, మహానీయుడు ఎన్టీఆర్ సమాజిక సమానత్వం కోసం చేసిన కృషిని ప్రస్తావించారు. తెలుగుదేశం దళితులకు అగ్రపథ పదవులు కల్పించిందని, ఎస్సీ వర్గీకరణ కోసం కృషి కొనసాగుతుందని స్పష్టం చేశారు.





