- రాష్ట్రవ్యాప్తంగా 6,27,277 మంది విద్యార్థులలో 6,16,451 మంది హాజరు
- కర్నూలులో కాపీయింగ్‌కు పాల్పడిన ఇద్దరు విద్యార్థులు డిబార్
ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. మొదటి భాష పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని, 98.27% విద్యార్థులు హాజరయ్యారని పాఠశాల విద్య డైరెక్టర్ విజయ్‌రామరాజు తెలిపారు. 3,450 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతుండగా, 1,545 కేంద్రాలను ఫ్లయింగ్ స్క్వాడ్లు తనిఖీ చేశాయి.
ఇన్విజిలేటర్ పొరపాటుతో విద్యార్థికి సమస్య
తెనాలిలోని ఐతానగర్‌లో ఓ విద్యార్థిని కాంపోజిట్ తెలుగు పరీక్ష రాయాల్సి ఉండగా, పొరపాటున జనరల్ తెలుగు పేపరు రాసింది. ఇన్విజిలేటర్ తప్పిదం కారణంగా చివరి సమయంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. డీఈవో సీవీ రేణుక విచారణ జరిపి, ఇన్విజిలేటర్‌ను సస్పెండ్ చేశారు. విద్యార్థికి నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.





