ఎస్‌ఐపీబీ సమావేశంలో రూ.44,776 కోట్ల పెట్టుబడులకు ఆమోదం. 20 వేల ఉద్యోగాల కల్పనపై ప్రభుత్వం దృష్టి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అధ్యక్షతన స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డ్ (SIPB) మూడో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 15 ప్రాజెక్టులకు పెట్టుబడుల ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకున్నారు. రూ. 44,776 కోట్ల పెట్టుబడుల ద్వారా సుమారు 20 వేల మందికి ఉద్యోగాలు కల్పించే ప్రణాళికను ప్రభుత్వం సిద్ధం చేసింది. గత సమావేశాల్లో ఆమోదం పొందిన ప్రాజెక్టుల పురోగతిపై కూడా సమీక్ష జరిగింది.
పెట్టుబడుల అమలు వేగంగా జరగాలి
సీఎం చంద్రబాబు పెట్టుబడుల అమలును వేగవంతం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. పరిశ్రమల యాజమాన్యాలతో నిరంతర చర్చలు జరిపి, ప్రాజెక్టుల ఆరంభం కోసం ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. పెట్టుబడులపై దిగ్గజ సంస్థల స్పందన సంతృప్తికరంగా ఉందని తెలియజేశారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అమలు చేసి పెట్టుబడులను కర్షించాల్సిన అవసరాన్ని హైలైట్ చేశారు. రాష్ట్ర స్థాయిలో అనుమతులు, క్షేత్ర స్థాయిలో పనులపై కలెక్టర్లతో సమీక్షలు జరపాలని ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు ఇచ్చారు.






