- డబుల్ ఇంజిన్ సర్కార్ లేకుంటే అభివృద్ధి సాధ్యం కాదు
- రైతు భరోసా, మహిళా సంక్షేమం, విద్యుత్ బిల్లుల తగ్గింపు ప్రాధాన్యత
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ను పునర్నిర్మించే లక్ష్యంతోనే తాము కలిసి పోటీ చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో స్పష్టం చేశారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైఎస్సార్సీపీ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నిర్వీర్యమైందని ఆరోపించారు. “కేంద్ర సహకారం లేకుండా రాష్ట్రాన్ని తిరిగి నిలబెట్టలేమని భావించాం. అందుకే డబుల్ ఇంజిన్ సర్కార్‌ను ప్రజలు కోరారు” అని చెప్పారు.
సంక్షేమం – అభివృద్ధి రెండూ మా ప్రభుత్వం లక్ష్యం
ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో తాము కట్టుబడి ఉన్నామని సీఎం అన్నారు. పింఛన్ నుంచి రైతు భరోసా వరకు అన్ని హామీలను నెరవేరుస్తున్నట్లు తెలిపారు. పింఛన్ రూ.200 నుంచి రూ.4,000కు పెంపు, దివ్యాంగులకు రూ.6,000, మంచానికే పరిమితమైన వారికి రూ.15,000
- 203 అన్న క్యాంటీన్లు పునరుద్ధరణ
- మే నెలలో తల్లికి వందనం పథకం అమలు
- రైతు భరోసా కింద రూ.20,000 అందజేత
- 16,384 టీచర్ పోస్టుల భర్తీ వచ్చే ఏడాది
రాజధాని, పోలవరం – వైఎస్సార్సీపీ పాలనపై విమర్శలు
చంద్రబాబు రాజధాని అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అన్ని మౌలిక సదుపాయాలతో అమరావతిని నిర్మిస్తామని చెప్పారు. వైఎస్సార్సీపీ హయాంలో పోలవరం నిర్వీర్యమైందని ఆరోపిస్తూ, 2027 డిసెంబర్‌కు ప్రాజెక్టును పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. పోలవరానికి డయాఫ్రం వాల్‌ను గోదావరిలో కలిపేశారు. ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు. కాంట్రాక్టర్ల కోసం ప్రాజెక్టులు, ప్రజల కోసం కాదని విమర్శ.
రైతులకు హామీ – విద్యుత్ ఛార్జీల తగ్గింపు
రైతుల కోసం ధాన్యం సేకరణ తర్వాత 24 గంటల్లోనే చెల్లింపు చేస్తామన్నారు. అలాగే, ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్ రూ.1.50కి అందజేస్తామని చెప్పారు.
- గత ప్రభుత్వ హయాంలో 8 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని ఆరోపణ
- విద్యుత్ రంగంలో రూ.1.10 లక్షల కోట్లు అప్పు
- రాష్ట్రాన్ని లాజిస్టిక్ హబ్‌గా మారుస్తామని ప్రకటన
సాంకేతిక సేవలు – మహిళా భద్రతపై దృష్టి
వాట్సాప్ ద్వారా 1,000 ప్రభుత్వ సేవలు అందించనున్నట్లు చంద్రబాబు తెలిపారు. మహిళల భద్రతపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
- ఆడబిడ్డలపై దాడులకు పాల్పడితే అదే వారి చివరి రోజు
- ల్యాండ్ మాఫియా రికార్డులను గల్లంతు చేశారని వైఎస్సార్సీపీపై విమర్శ
- 2047 విజన్ సాధనకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది





