- మండే ఎండల దృష్ట్యా ఒంటి పూట బడులను ముందుగా ప్రారంభించే యోచన
- మార్చి 10వ తేదీ నుంచి అమల్లోకి వచ్చే అవకాశాలు
అమరావతి, ఫిబ్రవరి 25: ఏపీలో హాఫ్ డే స్కూల్స్ నిర్ణీత సమయానికి ముందే ప్రారంభం కానున్నాయా? ప్రస్తుతం కనిపిస్తున్న సంకేతాలు అవుననే సూచిస్తున్నాయి. రాష్ట్రంలో మండుతున్న ఎండలు, వేడి ఉక్కపోత విద్యార్థులకు ఇబ్బందిగా మారడంతో, ప్రభుత్వం ఒంటి పూట బడుల అమలుపై సీరియస్‌గా ఆలోచిస్తోంది. విద్యార్థులు ఎండలతో అవస్థలు పడకుండా ముందస్తుగా ఒంటి పూట బడులు ప్రారంభించాలని విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ విషయాన్ని విద్యా శాఖ అధికారులు మంత్రి నారా లోకేశ్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. అనధికారిక సమాచారం ప్రకారం, మార్చి 10 నుంచి ఒంటి పూట బడులు ప్రారంభించాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది.





