- సమాజంలో విద్వేషాలు వ్యాపింపజేసే వారిపై కఠిన చర్యలు.
- పోసాని, గోరంట్ల మాధవ్‌లకు మంత్రి అనిత హెచ్చరిక.
సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా, విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడే వారిని ప్రభుత్వం ఉపేక్షించదని హోం మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. అనంతపురంలో జరిగిన ఎస్సైల పాసింగ్ అవుట్ పరేడ్‌లో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
పోసాని, గోరంట్ల మాధవ్‌లకు హెచ్చరిక
పోసాని కృష్ణమురళి గతంలో చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా 17 కేసులు నమోదయ్యాయని, ఆయన చేసిన తప్పులకు శిక్ష తప్పదని మంత్రి అనిత అన్నారు. గోరంట్ల మాధవ్ కూడా నోటిని అదుపులో పెట్టుకోవాలని, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. గత ప్రభుత్వం పోలీసులకు 900 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి వెళ్లిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 250 కోట్ల రూపాయలు చెల్లించామని తెలిపారు. అమరావతిలో ఫోరెన్సిక్ ల్యాబ్ నిర్మాణాన్ని గత ప్రభుత్వం ఆపివేసిందని, హోం శాఖలో సిబ్బంది కొరత ఉందని, త్వరలోనే నియామకాలు చేపడతామని మంత్రి అనిత పేర్కొన్నారు.





