- ఎంఐఎస్ కింద కొనుగోలు పరిమితి 75% వరకు పెంపు
- చెరవుతున్న ధర వ్యత్యాసాన్ని త్వరలోనే చెల్లించనున్న కేంద్రం
ఆంధ్రప్రదేశ్‌లో మిర్చి ధరలు పడిపోవడంతో ఇబ్బంది పడుతున్న రైతులను ఆదుకోవాలని సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేయగా, కేంద్రం సానుకూలంగా స్పందించింది. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ అధ్యక్షతన న్యూఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో మిర్చి రైతుల సమస్యలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
రైతులకు లబ్ధి కలిగే కీలక నిర్ణయాలు
- మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం (MIS) కింద కొనుగోలు పరిమితి 25% నుంచి 75% వరకు పెంపు
- పంటకు అయ్యే ఖర్చును ఐకార్ నిర్ణయించిన ధర కాకుండా, ఏపీ ప్రభుత్వం సూచించిన రూ.11,600 పరిగణనలోకి తీసుకోవాలని ఒప్పుకోలు
- మిర్చి ఎగుమతులపై రాష్ట్రంలో ప్రత్యేక సదస్సు ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాలని నిర్ణయం
ఈ నిర్ణయాలతో గుంటూరు, పల్నాడు, రాయలసీమ ప్రాంతాల్లోని మిర్చి రైతులకు మేలు జరుగుతుందని మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. కేంద్రం ఇచ్చే ప్రతి పైసా నేరుగా రైతులకే అందుతుందని స్పష్టం చేశారు.






