- తొలిసారిగా ఆంగ్ల మాధ్యమం, NCERT సిలబస్‌తో పరీక్షలు
- విద్యార్థులకు ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం, వాట్సాప్ ద్వారా హాల్‌టికెట్ డౌన్‌లోడ్
ఏపీ పదోతరగతి పరీక్షలు రేపటి (సోమవారం) నుంచి ప్రారంభం కానున్నాయి. ఈసారి తొలిసారిగా విద్యార్థులు NCERT సిలబస్, ఆంగ్ల మాధ్యమంతో పరీక్షలు రాయనుండటం విశేషం. మొత్తం 5.64 లక్షల మంది విద్యార్థులు ఆంగ్ల మాధ్యమంలో, 51 వేల మంది తెలుగులో పరీక్షలు రాయనున్నారు. మొదటిసారి ఏడు పేపర్ల విధానాన్ని అమలు చేస్తున్నారు. సామాన్యశాస్త్రంలో భౌతిక, రసాయనశాస్త్రాలు కలిపి ఒక పేపర్‌గా, జీవశాస్త్రం మరో పేపర్‌గా పరీక్ష నిర్వహించనున్నారు.
విద్యార్థులకు RTC ఉచిత ప్రయాణం
ఏపీఎస్‌ఆర్టీసీ పదోతరగతి విద్యార్థులకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని ప్రకటించింది. మార్చి 17 నుంచి 31 వరకు హాల్‌టికెట్ చూపించి ఉచితంగా బస్సులో ప్రయాణించవచ్చు. విద్యార్థుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనపు బస్సులను ఏర్పాటు చేయనున్నారు. విద్యార్థులు తమ హాల్‌టికెట్‌ను 9552300009 నెంబర్‌కు Hi మెసేజ్ పంపి వాట్సాప్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లింక్‌లో విద్యా సేవల విభాగాన్ని ఎంచుకుని, తమ వివరాలను నమోదు చేస్తే హాల్‌టికెట్ అందుబాటులోకి వస్తుంది.





