- 2025-26 విద్యుత్ టారిఫ్ విడుదల, ఎలాంటి ఛార్జీ పెంపు లేదని ప్రకటించిన APERC
- ఇళ్ల నిర్మాణాలకు గృహ వినియోగ ఛార్జీలు, ఎలక్ట్రిక్ వాహన ఛార్జింగ్‌కి సులభతరం
ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి (APERC) 2025-26 విద్యుత్ టారిఫ్‌ను తిరుపతిలో విడుదల చేసింది. విద్యుత్ ఛార్జీలు ఏ విభాగంలోనూ పెంచడం లేదని మండలి ఛైర్మన్ రాంసింగ్ ఠాగూర్ వెల్లడించారు. విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ ఆదాయ వ్యయాల్లో ₹12,632 కోట్ల లోటును ప్రభుత్వం భర్తీ చేయడంతో వినియోగదారులపై భారం పడటం లేదు. గతంలో ఇళ్ల నిర్మాణాలకు వాణిజ్య ఛార్జీలు వసూలు చేసేవారు. అయితే ఇప్పటి నుంచి గృహ వినియోగదారుల విభాగంలో విద్యుత్ కనెక్షన్ మంజూరు చేయనున్నారు. అదనపు లోడ్ వినియోగంపై 100% రుసుము వసూలు చేసేవారు, ఇప్పుడు 50% మాత్రమే తీసుకుంటారు. విద్యుత్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు ఛార్జింగ్ స్టేషన్‌లకు LT లైన్ల ద్వారా విద్యుత్ వినియోగానికి అనుమతి ఇచ్చింది.





