బాలకృష్ణ నటించిన ‘అఖండ 2’ చిత్రం కొత్త రిలీజ్ డేట్ ఖరారైంది. నిర్మాత సంస్థ ‘14 రీల్స్ ప్లస్’ ప్రకటించిన ప్రకారం, ఈ సినిమా డిసెంబర్ 12న థియేటర్లలోకి రానుంది.. 5న రావాల్సి ఉండగా ఆర్థిక కారణాలతో వాయిదా పడింది. ఇప్పుడు అన్ని ఇబ్బందులు సర్దుబాటు కావడంతో కొత్త పోస్టర్ ద్వారా తేదీ ప్రకటించారు. ఈ నెల 11న ప్రీమియర్స్ ఉంటాయి. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ చిత్రం ‘అఖండ’కు సీక్వెల్‌గా 3డీ ఫార్మాట్‌లో వస్తుంది. ఇదే తేదీకి రిలీజ్‌కు సిద్ధమైన ‘మోగ్లీ’, ‘సఃకుటుంబానాం’ వంటి చిన్న సినిమాలు వాయిదా పడే అవకాశముంది.





