ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ భోగి పండగ శుభాకాంక్షలు తెలియజేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu). ఈ సందర్భంగా ‘ఎక్స్’ వేదికగా చేసిన పోస్టులో ఆయన భోగి మంటలతో ప్రజల సమస్యలన్నీ తొలగిపోవాలని ఆకాంక్షించారు. పండుగ పూట సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలని, ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు నిండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
‘‘పవిత్రమైన ఈ భోగి పండగ మీ జీవితాల్లో కొత్త వెలుగులు తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నాను. మీ సమస్యలన్నీ తీరిపోవాలని, భోగ భాగ్యాలు మీ అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ఆశలు, ఆశయాలను నెరవేర్చడానికి ప్రజాప్రతినిధులుగా మేము ఎల్లప్పుడూ మీతో ఉంటామనే హామీ ఇస్తున్నాను’’ అని చంద్రబాబు తన సందేశంలో పేర్కొన్నారు.





