- SME రుణ పరిమితి ₹5 కోట్ల నుంచి ₹10 కోట్లకు పెంపు
- స్టార్టప్ రుణ పరిమితి ₹10 కోట్ల నుంచి ₹20 కోట్లకు పెంపు
- బొమ్మల తయారీ పరిశ్రమకు ప్రత్యేక పథకం ప్రవేశపెట్టిన కేంద్రం
“MSME, స్టార్టప్‌లకు భారీ ఊరట!”
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2025-26 ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు (MSME) ఇచ్చే రుణ పరిమితిని ₹5 కోట్ల నుంచి ₹10 కోట్లకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇది వ్యాపార వృద్ధికి మరింత ఊతమివ్వనుంది.భారతదేశంలో స్టార్టప్‌ల వృద్ధికి ఊతమివ్వడానికి, కేంద్ర ప్రభుత్వం రూ.10 కోట్ల నుంచి రూ.20 కోట్లకు రుణ పరిమితిని పెంచింది.
బొమ్మల తయారీ పరిశ్రమకు కొత్త పథకం
దేశీయ బొమ్మల తయారీ పరిశ్రమ అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక పథకాన్ని ప్రకటించింది. దేశీయంగా తయారవుతున్న బొమ్మల దిగుమతిపై ఆధారపడకుండా, దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.






