- సినీ నటి, బీజేపీ నేత మాధవీలత ఫిర్యాదుతో కేసు నమోదు
- న్యూ ఇయర్ వేడుకల వ్యాఖ్యల వివాదం దర్యాప్తులోకి
తాడిపత్రి టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. సినీ నటి, బీజేపీ నేత మాధవీలత ఫిర్యాదుతో సైబరాబాద్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. న్యూ ఇయర్ వేడుకల సమయంలో జేసీ మరియు మాధవీలత మధ్య మాటల యుద్ధం నడిచిన సంగతి తెలిసిందే. జేసీ నిర్వహించిన వేడుకలకు వెళ్లొద్దంటూ మాధవీలత కామెంట్ చేయగా, దీనిపై జేసీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో తనను కించపరిచేలా మాట్లాడారని మాధవీలత పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాధవీలత తన ఫిర్యాదులో జేసీ అనుచరులు తనను బెదిరిస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా జేసీ నుంచి తనకు ప్రాణహాని ఉందని స్పష్టం చేశారు. ఫిర్యాదు ఆధారంగా సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.





