భారతదేశ సైబర్‌సెక్యూరిటీ పర్యవేక్షణ సంస్థ CERT-In, గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌లో రెండు కీలక భద్రతా లోపాలను గుర్తించింది. ఈ లోపాలు వినియోగదారుల వ్యక్తిగత డేటాను మరియు పరికరాలను ప్రమాదంలోకి నెట్టే అవకాశం ఉందని వెల్లడించింది. వినియోగదారులు తమ బ్రౌజర్‌ను వెంటనే నవీకరించాలని సూచించింది. ఈ భద్రతా లోపాలు CIVN-2025-0007 , CIVN-2025-0008గా గుర్తించబడ్డాయి. వీటికి క్రిటికల్ మరియు హై రేటింగ్‌లు ఇచ్చారు. విండోస్, మాక్, లినక్స్ ప్లాట్‌ఫామ్‌లపై పనిచేస్తున్న గూగుల్ క్రోమ్ వెర్షన్లను ఇవి ప్రభావితం చేస్తాయి. అవుట్-ఆఫ్-బౌండ్స్ మెమరీ యాక్సెస్, తప్పు అమలు వంటి కారణాలు ఈ లోపాలకు మూలంగా ఉన్నట్లు CERT-In పేర్కొంది.
కొత్త వెర్షన్ కి అప్ డేట్!!
సైబర్ హానికర పరిస్థితులను నివారించేందుకు వినియోగదారులు వెంటనే గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ను తాజా వెర్షన్‌కు అప్ డేట్ చేసుకోవాలి. ముఖ్యంగా డెస్క్‌టాప్, లాప్‌టాప్ వినియోగదారులు భద్రతా ప్యాచ్లను తప్పనిసరిగా అమలు చేయాలని సూచించారు. అయితే, స్మార్ట్‌ఫోన్ వినియోగదారులపై ఈ లోపాల ప్రభావం తక్కువగా ఉంటుందని CERT-In పేర్కొంది.






