- సొంతగడ్డపై టోర్నీ నుంచి నిష్క్రమించిన పాక్
- డిఫెండింగ్ ఛాంపియన్‌గా సెమీస్ చేరకుండానే ఇంటిముఖం
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఆతిథ్య జట్టు పాకిస్థాన్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన పాక్, రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలై లీగ్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. సోమవారం న్యూజిలాండ్ చేతిలో బంగ్లాదేశ్ ఓడిపోవడంతో పాకిస్థాన్ సెమీస్ ఆశలు ముగిసిపోయాయి. 2009 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఆతిథ్య జట్టు లీగ్ దశలోనే నిష్క్రమించడం ఇదే తొలిసారి. 2009లో సౌతాఫ్రికా లీగ్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇప్పుడు పాకిస్థాన్ కూడా అదే పరిస్థితే ఎదుర్కొంది. చాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగి, సెమీస్ చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించిన నాలుగో జట్టుగా పాకిస్థాన్ నిలిచింది. 2004లో భారత్, శ్రీలంక కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొన్నాయి. 2013లో ఆస్ట్రేలియా ఒక్క మ్యాచ్ గెలవకుండానే లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టింది.





