దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సు (డబ్ల్యూఈఎఫ్)లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మూడు సెషన్లలో ముఖ్యవక్తగా పాల్గొననున్నారు. ఐదు రోజులపాటు జరిగే ఈ సమావేశాల్లో మంత్రి లోకేశ్ రెండు సెషన్లలో మాట్లాడతారు. శనివారం రాత్రి చంద్రబాబు దావోస్‌కు బయలుదేరుతారు. ఈ సదస్సులో రాష్ట్రంలో పెట్టుబడులకున్న అవకాశాలను వివరిస్తూ క్లీన్ ఎనర్జీ, ఐటీ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి.
రాష్ట్ర పెవిలియన్, ప్రత్యేక సమావేశాలు
దావోస్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ పెవిలియన్‌లో ఒకేసారి నాలుగు రౌండ్‌టేబుల్ సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. 18 దేశాలకు చెందిన కంపెనీల సీఈవోలతో ద్వైపాక్షిక సమావేశాలు జరగనున్నాయి. ఈ సదస్సులో ప్రపంచస్థాయి కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరిపి రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు సమీకరించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.





