- ఉగాది సందర్భంగా చిరంజీవి 157వ సినిమా గ్రాండ్గా లాంఛనప్రాయంగా ప్రారంభం
- కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో చిరు కొత్త గెటప్
మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కబోయే #Chiru157 సినిమా ఉగాది సందర్భంగా అట్టహాసంగా లాంఛనప్రాయంగా ప్రారంభమైంది. ఈ వేడుక రామానాయుడు స్టూడియోలో జరగ్గా, హీరో వెంకటేశ్ క్లాప్ కొట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి అశ్వనీదత్, అల్లు అరవింద్, దిల్ రాజు, నాగవంశీ, దర్శకులు రాఘవేంద్రరావు, వంశీ పైడిపల్లి, శ్రీకాంత్ ఓదెల, రచయిత విజయేంద్ర ప్రసాద్ తదితరులు హాజరయ్యారు.
ఈ చిత్రాన్ని సాహు గారపాటి, చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించనుండగా, సినిమా పూర్తిగా కామెడీ ఎంటర్టైనర్ అని, చిరు కొత్త లుక్లో కనిపించనున్నారని సమాచారం. అదితి రావు హైదరి ఇందులో ఓ హీరోయిన్గా ఫిక్స్ కాగా, మరో కథానాయిక ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం ‘విశ్వంభర’ సినిమాతో బిజీగా ఉన్న చిరంజీవి, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మరో ప్రాజెక్ట్ చేయబోతున్నారు. అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.





