దావోస్ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధికి కీలక ప్రకటన చేశారు. టాటా సంస్థతో కలసి అమరావతిలో సీఐఐ (కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ) కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కేంద్రం పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి కల్పన లక్ష్యాలతో ముందుకు సాగనుంది. సీఐఐ కేంద్రం ద్వారా పరిశ్రమలకు శిక్షణా కార్యక్రమాలు, సలహా సేవలు అందించనున్నట్లు చంద్రబాబు వివరించారు. పరిశ్రమల్లో పోటీతత్వం పెంపొందించడమే లక్ష్యమని తెలిపారు. భారత 2047 విజన్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాజెక్ట్‌ను రూపుదిద్దుతున్నామని చెప్పారు.





