మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. గురువారం రాత్రి ‘ఎక్స్’ వేదికగా ఆయన చేసిన ట్వీట్‌లో, “దేశంలోనే గొప్ప ఆర్థిక వేత్త, నాయకుడు, సంస్కరణవాది, అన్నిటికంటే మించి మానవతావాది మన్మోహన్ సింగ్ ఇకలేరు” అని పేర్కొన్నారు.
మన్మోహన్ సింగ్‌ను “ధర్మానికి ప్రతీకగా, నిష్కలంకమైన సమగ్రత కలిగిన నాయకుడిగా గుర్తింపు పొందిన” వ్యక్తిగా అభివర్ణించారు. “తన రాజకీయ, ప్రజా జీవితంలో ఔన్నత్యాన్ని ప్రదర్శించిన భూమి పుత్రుడిని దేశం కోల్పోయింది” అని ఆయన అన్నారు. ఈ సందర్భంగా, “మన్మోహన్ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను” అని ట్వీట్‌లో తెలిపారు.





