సమాజంపై సినిమాల మిశ్రమ ప్రభావం..
సినిమాలు మన జీవితాలకు అందించే స్ఫూర్తి, శక్తివంతమైన కథలు ఎంతగానో ప్రభావితం చేస్తాయి. అయితే కొన్ని సందర్భాల్లో అవి క్రైమ్‌లకు ప్రేరణగా మారుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. తాజాగా మీర్‌పేట్ మాధవి హత్య కేసులో నిందితుడు ఓటీటీ కంటెంట్ ప్రభావంతో తన నేరం ఆచరించినట్టు వెల్లడించడం ఆందోళన కలిగిస్తోంది. మలయాళ క్రైమ్ థ్రిల్లర్ “సూక్ష్మదర్శిని”ని అనుకరించినట్టు నిందితుడు పేర్కొనడం పోలీసుల్ని విస్మయానికి గురి చేసింది..
ఆర్థిక స్థితి: పన్నుల భారం పెరగడం ఖాయమా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నీతి ఆయోగ్ స్టేట్ ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్-2025 నివేదికపై ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడకపోతే అభివృద్ధి పనులకు నిధులు కేటాయించలేని పరిస్థితి వస్తుందని, ప్రజలపై పన్నుల భారం పెరిగే అవకాశముందని హెచ్చరించారు. ఆర్థిక వ్యూహాలను సరిచేయడం రాష్ట్ర ప్రభుత్వానికి కీలకం కానుందని ఆయన ప్రెస్ మీట్ లో తెలిపారు..
పద్మ అవార్డుల వివాదంపై మాటల యుద్ధం
పద్మ అవార్డుల కేటాయింపులో వివక్ష ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత బండి సంజయ్ ప్రతిస్పందించారు. గద్దర్‌కు అవార్డు ఇవ్వడంపై తన అభ్యంతరాలను వ్యక్తపరిచారు. “నక్సలైట్ భావజాలానికి చెందినవారికి అవార్డులు ఎలా ఇస్తాం?” అని ప్రశ్నించారు. రాష్ట్రం అర్హుల పేర్లు పంపితేనే అవార్డులు వస్తాయని బండి సంజయ్ అన్నారు..
.. ఇలాంటి మరిన్ని అంశాలతో కూడిన ఈ-పేపర్ కోసం క్లిక్ చేయండి.






