టెక్ టాక్: అవసరానికి ఒకటి.. ఆర్డర్ పెట్టేయొచ్చు. హాయిగా వాడుకోవచ్చు!

తుడి చేయడమే కాదు.. మాపింగ్ చేస్తుంది!

ఇంటిల్లిపాదీ ఎవరి పనిలో వాళ్లు బిజీనే. అయినప్పటికీ ఇల్లాలు మాత్రం ఇంటినీ, ఆఫీస్ నీ బ్యాలెన్స్ చేయాల్సిందే.  వంటలు ఒకవైపు.. ఇంటి పరిశుభ్రత మరో వైపు. తెగ హైరానా పడిపోవడం చూస్తూనే ఉంటాం. అందుకే అమ్మకి కాస్త పని భారాన్ని తగ్గించేందుకు టెక్నాలజీ సాయం తీసుకుంటే సరి. అదెలాగంటే.. ఇదిగో ఈ వాక్యూమ్ క్లీనర్. షామీ కంపెనీ దీన్ని తయారు చేసింది. పేరు Xiaomi Robot Vacuum Cleaner S10.  దీన్ని ఇంట్లో అమ్మకి స్మార్ట్ అసిస్టెంట్ గా పట్టేయొచ్చు. ఇంట్లో ఓ మూల సెట్ చేస్తే చాలు. ఇల్లంతా నాదే అంటూ.. తుడి చేస్తుంది. ఆ వెంటనే తడిగుడ్డ పెట్టేస్తుంది. రోజులో ఎన్ని సార్లు..  ఎక్కడెక్కడ తుడాలి.. మాప్ పెట్టాలో క్లీనర్ లో సెట్ చేస్తే చాలు.  సమయం కాగానే ఆలోమాటిక్ దానంతట అదే డాక్ స్టేషన్ నుంచి బయటికి వచ్చేస్తుంది. మ్యాపింగ్ చేసిన ప్రకారం తుడి చేస్తుంది.  గదిలో వస్తువుల్ని లేజర్ రేస్ ద్వారా గుర్తిస్తూ.. చక చకా సోఫాలు, టేబుల్స్ కింద కూడా తుడి చేస్తుంది. గదుల్లో ఉన్న చెత్త ఆధారంగా మోడ్స్ సెట్ చేసుకునే వీలుంది. క్లీనర్ బ్యాటరీ సామర్థ్యం 3,200 ఏంఏహెచ్. స్టాండర్డ్ మోడ్ లో 130 నిమిషాలు ఛార్జింగ్ వస్తుంది.  ఫోన్ నే రిమోట్ చేసుకుని బయటి నుంచే క్లీనర్ కి కమాండ్స్ పాస్ చేయొచ్చు. 

* ధర రూ. 18,999

* దొరుకు చోటు: https://rb.gy/2na61p

ఆల్ ఇన్ వన్.. హెడ్ సెట్ 

ఉద్యోగ నిమిత్తమో.. వ్యక్తిగతంగానో ఎక్కువగా వీడియో లేదా వాయిస్ కాల్స్ మాట్లాడాల్సి వస్తోందా? అయితే, మీ కోసమే ఈ హెడ్ ఫోన్స్.  అమెజాన్ కంపెనీ ‘బేసిక్స్’ పేరుతో అందించే ఉత్పత్తుల్లో ఇది ఒకటి. నోయిస్ క్యాన్సిలేషన్ తో ఈ హెడ్ ఫోన్ పని చేస్తుంది. ఎక్కువ సమయం పాటు పెట్టుకున్నా చెవులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వీటిని డిజైన్ చేశారు.  రెండు మఫ్స్ చెవుల్ని పూర్తిగా కవర్ చేయడం వల్ల సౌండ్ చక్కగా (7.1 చానల్ వర్చువల్ సరౌండ్  ఆడియో) వినిపిస్తుంది.  గేమింగ్ ప్రియులకూ ఇదో చక్కని ఎంపిక.  మల్టీ ప్లేయర్ గేమింగ్ లో సహచరులతో సంభాషిస్తూ చలాకీగా గేమ్స్ ఆడొచ్చు. 

* ధర రూ. 1599

* దొరుకు చోటు: https://rb.gy/w1lzij 

స్మార్ట్ ‘టోస్టర్’ 

పొద్దున్నే లేవగానే ఒకటే ఉరుకుల పరుగులు. స్కూల్ కి వెళ్లేందుకు పిల్లలు ఒకవైపు.. ఆఫీస్ కి రెడీ అవుతూ ఆలుమగలు మరోవైపు.. ఈ టైమ్ అందరికీ ఎంతో ముఖ్యమైంది బ్రేక్ ఫాస్ట్. ఇన్స్ స్టెంట్ గా అప్పటికప్పుడు ఏదో ఒకటి కానిచ్చేద్దాం అనుకునే వారే ఎక్కువ. ఎందుకంటే.. రోజూ స్పెషల్స్ ఉండవుకదా. ఇలాంటి సందర్భాల్లో చటుక్కున బ్రడ్ ని క్షణాల్లో టోస్ట్ చేసి ఇచ్చేస్తే!! సూపర్ కదా.. అందుకే బజాజ్ అందుబాటులోకి తెచ్చిన ATX 4 750-Watt 2-Slice Pop-up Toaster ని వంట గదిలో పెట్టేయండి. 6 రకాల పద్ధతుల్లో బ్రడ్ ని టోస్ట్ చేయొచ్చు. ఒక వేళ ఎక్కువ మాడిపోతుందేమో అనిపిస్తే.. మధ్యలోనే బయటికి తీసేందుకు ‘మిడ్  క్యాన్సిల్’ ఫీచర్ ఉంది. బర్నర్ లోకి దుమ్ము పడకుండా ‘డస్ట్ కవర్’ ని ఏర్పాటు చేశారు. అలాగే, బ్రడ్ కాల్చేటప్పుడు కిందపడే పొడాన్ని కవర్ చేసేందుకు ‘స్లైడ్ అవుట్ క్రబ్ ట్రే’ ఉంది. చివర్లో బయటికి లాగి పొడాన్ని పడేయొచ్చు. 

* ధర రూ. 1199

* దొరుకు చోటు: https://rb.gy/ha2jcd

వింటేజ్ స్టైల్ లో వినేద్దాం!! 

అటనాటి మధుర గీతాల్ని తాత ముత్తాతలు గ్రామోఫోన్ లో వింటూ ఎంజాయ్ చేసేవారని వినుంటాం. కొన్ని సినిమాల్లోనూ చూశాం.  ఇప్పుడూ అదే ఫీల్ తో మ్యూజిక్ ట్రాక్స్ వినేద్దాం అనుకుంటే ఈ గ్రామోఫోన్ ని ట్రై చేయొచ్చు. దీని పేరు కూడా Vintage Gramophone Bluetooth Speaker. రెట్రోలుక్ తో కాస్త మోడ్రన్ గా దీన్ని డిజైన్ చేశారు. బ్లూటూత్ 5.0 వెర్షన్ తో డివైజ్ లకు కనెక్ట్ చేయొచ్చు. 10 మీటర్ల పరిధిలో బ్లూటూత్ పని చేస్తుంది.  ఒక్కసారి చార్జ్ చేస్తే సుమారు 6 గంటలు పని చేస్తుంది. 3.5 జాక్ తోనూ స్పీకర్ ని కనెక్ట్ చేయొచ్చు. ఎక్కడికైనా సౌకర్యంగా తీసుకెళ్లి మ్యూజిక్ మస్తీ చేయొచ్చు. కార్డ్ రీడర్ కూడా ఉంది.  ఒక్క మ్యూజిక్ వినడమే కాదు.. ఫోన్ కి ఏమైనా కాల్స్ వస్తే స్పికర్ నుంచే మాట్లాడొచ్చు. 

* ధర రూ. 1699

* దొరుకు చోటు: https://rb.gy/ha2jcd

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మీ బిజినెస్ ని ఇక్కడ ప్రమోట్ చేస్కోండి !

Your Ads Here (365 x 270 area)
Breaking News
కేటగిరి

మా న్యూస్ అప్డేట్లు కోసం సబ్‌స్క్రైబ్ చేయండి!

Everyday we discover real news for you.