పీక్స్‌లో కెరీర్.. చీకటి రోజులు: షాకింగ్ నిజాలు షేర్ చేసుకున్న దీపికా!!

  • కెరీర్ మంచి దశలో ఉన్నప్పుడే మానసిక కుంగుబాటుకు గురైన దీపికా.
  • కుటుంబ సభ్యుల సహకారంతో కుంగుబాటును జయించిన దీపికా.

బాలీవుడ్ నటి దీపికా పదుకొణె మానసిక ఆరోగ్యం గురించి తరచూ మాట్లాడుతూ అందరిలో అవగాహన కల్పిస్తుంటారు. ఆమె కెరీర్ మంచి స్థాయిలో ఉన్నప్పుడే కుంగుబాటుకు గురై చాలా ఇబ్బందిపడ్డారు. తాజాగా ఓ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఆనాటి రోజులను గుర్తు చేసుకున్నారు. ఏం జరుగుతుందో అర్థం కాక చాలా ఆవేదనకు గురైనట్లు చెప్పారు. ఆ సమయంలో కుటుంబ సభ్యులు తనకెంతో అండగా నిలిచారని వివరించారు.

అర్థం కాని ఆవేదన

2014లో కెరీర్ పరంగా మంచి స్థాయిలో ఉన్నానని, తనకు నచ్చిన సినిమాలు చేసుకుంటూ, సంతోషంగా ఉన్నానని దీపికా తెలిపారు. ప్రతి విషయంలోనూ ఆనందంగా ఉన్నానని, ఆ సమయంలోనే తీవ్ర అలసటకు గురయ్యానని చెప్పారు. వృత్తిలో ఇవన్నీ భాగమే అనుకున్నానని, ఓరోజు ఉదయం కళ్లు తిరిగి పడిపోయానని తెలిపారు. వెంటనే కావాల్సిన స్కానింగ్‌లు అన్నీ చేయించానని, తన పరిస్థితి సాధారణంగా లేదని కొన్ని వారాలకు అర్థమైందని చెప్పారు. ఏదో అయిపోతున్నట్లు భయపడేదానిని, అనవసరమైన వాటికి కూడా విపరీతంగా ఏడ్చేసేదానినని, తను తనులా ఉండలేకపోయానని తెలిపారు. తనను చూడటానికి ఓసారి అమ్మ వాళ్లు ముంబయి వచ్చారని, థెరపిస్ట్‌ను కలవమని అమ్మ సూచించిందని, అక్కడికి వెళ్లాక తాను మానసిక కుంగుబాటుకు లోనైనట్లు తెలిసిందని దీపికా వివరించారు.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *