చంద్రబాబు నాయుడు మనవడు, మంత్రి నారా లోకేశ్ తనయుడు దేవాంశ్ చదరంగంలో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. కేవలం తొమ్మిదేళ్ల ప్రాయంలో, 175 పజిల్స్‌ను వేగంగా పరిష్కరించి ‘ఫాస్టెస్ట్ చెక్‌మేట్ సాల్వర్’గా గుర్తింపు పొందాడు.దేవాంశ్ 11 నిమిషాలు 59 సెకన్లలో ఈ పజిల్స్‌ను పూర్తి చేశాడు. ఈ పోటీ “5334 ప్రాబ్లమ్స్ అండ్ గేమ్స్” అనే పుస్తకంలో ఉన్న పజిల్స్ ఆధారంగా రూపొందించబడింది. దేవాంశ్ ఇటీవల 7 డిస్క్ టవర్ ఆఫ్ హనోయ్ ను కేవలం 1 నిమిషం 43 సెకన్లలో పూర్తి చేశాడు. అలాగే, 9 చెస్ బోర్డులను 5 నిమిషాల్లో అమర్చాడు. ముఖ్యమంత్రి చంద్రబాబు దేవాంశ్ విజయాన్ని చూసి గర్వంగా ఉన్నట్లు చెప్పారు. “ఈ విజయం కఠోర శ్రమ, అంకితభావం వల్ల సాధ్యమైంది” అని ఆయన పేర్కొన్నారు. ఈ విజయంపై లోకేశ్ కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. “అంతర్జాతీయ స్థాయిలో భారతీయ చెస్ క్రీడాకారుల ప్రదర్శనల నుంచి దేవాంశ్ ప్రేరణ పొందాడు” అని లోకేశ్ పేర్కొన్నారు. దేవాంశ్ కోచ్ కె. రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, “అతని సృజనాత్మకత మరియు పట్టుదల స్ఫూర్తిదాయకం” అని తెలిపారు.





