అమెరికా 47వ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఓవల్ కార్యాలయంలో తన ప్రత్యేక కోక్ బటన్‌ను తిరిగి ఏర్పాటుచేశారు. కోకాకోలా ప్రియుడైన ట్రంప్ 2016లో అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ బటన్‌ను ఏర్పాటు చేయించారు. దానిని నొక్కిన వెంటనే డైట్ కోక్‌ను అందించేవారు.
బటన్‌పై ట్రంప్ ప్రత్యేక ఆసక్తి
2021లో జో బైడెన్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ బటన్‌ను తొలగించారు. తాజాగా ట్రంప్ మళ్లీ అధికారం చేపట్టడంతో తన కోక్ బటన్‌ను తిరిగి ఇన్‌స్టాల్ చేయించుకున్నారు. ‘‘నేను ఈ బటన్ నొక్కిన ప్రతిసారీ అందరూ కొంచెం భయపడతారు,’’ అని గతంలో ట్రంప్ జోక్ చేశారు. ట్రంప్ మంచినీళ్లు తాగడం చూడలేదని యూఎఫ్‌సీ సీఈవో డానా వైట్ వెల్లడించగా, ఇటీవల ట్రంప్ రెగ్యులర్ కోక్ కూడా తాగుతున్నట్లు సమాచారం.





