ఎండు చేపలా? పచ్చి చేపలా? మన ఆరోగ్యానికి ఏది ఉత్తమం?

చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని మనందరికీ తెలుసు. కానీ, ఎండు చేపలా, పచ్చి చేపలా, ఏవి మన ఆరోగ్యానికి ఎక్కువ ప్రయోజనం చేకూరుస్తాయి అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. ఈ ప్రశ్నకు సమాధానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

ఎండు చేపల్లో ప్రోటీన్ శాతం అధికంగా ఉంటుంది. పచ్చి చేపలు త్వరగా పాడవుతాయి, కానీ ఎండు చేపలను ఎక్కువ కాలం నిల్వ చేయవచ్చు.

ఎండు చేపల్లో నీరు పూర్తిగా తొలగిపోవడం వల్ల ప్రోటీన్లు, ఖనిజాలు, విటమిన్లు అధిక మొత్తంలో ఉంటాయి. పచ్చి చేపలతో పోలిస్తే, ఎండు చేపల్లో ప్రోటీన్ శాతం దాదాపు మూడు రెట్లు ఎక్కువగా ఉంటుంది. అయితే, ఎండు చేపల్లో ఉప్పు శాతం కూడా ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి, రక్తపోటు, గుండె జబ్బులు ఉన్నవారు వీటిని తక్కువగా తీసుకోవడం మంచిది.

ఉప్పును తగ్గించే మార్గాలు

ఎండు చేపల్లోని ఉప్పును తగ్గించడానికి, వాటిని వండే ముందు 40 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద నీటిలో అరగంట పాటు మరిగించాలి. అలాగే, చేపలను ఎండబెట్టేటప్పుడు తక్కువ ఉప్పు, కొద్దిగా పంచదార కలిపితే ఉప్పు శాతం తగ్గుతుంది. పచ్చి చేపల్లో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్లు D, A, K, B12, జింక్, మెగ్నీషియం, కాల్షియం, అయోడిన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని 65-70 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద ఉడికించడం ద్వారా సూక్ష్మక్రిములను నాశనం చేయవచ్చు.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *