- సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యల కేసు
- మార్చి 5న విచారణకు హాజరుకావాలని ఆదేశం
వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఇంటికి విజయవాడ పోలీసులు వెళ్లారు. సోషల్ మీడియా వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై కేసు నమోదు కాగా, పోలీసులు సెక్షన్ 35(3) కింద నోటీసులు అందజేశారు. అనంతపురంలోని మాధవ్ ఇంటికి వెళ్లిన పోలీసులు, మార్చి 5న సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట విచారణకు హాజరుకావాలని సూచించారు.





