- శేషసాయి పరిశ్రమలో మంటలు చెలరేగి పక్కనే ఉన్న రబ్బర్ కంపెనీకి వ్యాపించాయి.
- అగ్నిమాపక సిబ్బంది మంటలార్పేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
చర్లపల్లి పారిశ్రామిక వాడలోని శేషసాయి రసాయన పరిశ్రమలో మంగళవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా ఎగసిపడిన మంటలు చుట్టుపక్కల పరిశ్రమలకు వ్యాపించడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మహాలక్ష్మి రబ్బర్ కంపెనీకి మంటలు అంటుకోవడంతో రసాయనాల దుర్వాసన చుట్టుపక్కల ప్రాంతాలను వ్యాప్తి చేసింది. ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలార్పే పనిలో నిమగ్నమయ్యారు. ప్రమాదానికి గల అసలైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.





