కూటమి ప్రభుత్వం నిరుపేదలకు శుభవార్త అందించింది. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల చొప్పున నివాస స్థలాలను ఉచితంగా కేటాయించనున్నట్లు ప్రకటించింది. శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు గృహనిర్మాణ, సమాచార శాఖల మంత్రి పార్థసారథి వెల్లడించారు. 2019 అక్టోబర్ 15 నాటికి ఆక్రమణలో ఉన్న నివాసాలకు సంబంధించి క్రమబద్ధీకరణ దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు.
ఆక్రమణల క్రమబద్ధీకరణ
- 15.10.2019 నాటికి ఆక్రమణలో ఉన్న అభ్యంతరం లేని ప్రభుత్వ స్థలాలను క్రమబద్ధీకరిస్తారు.
- జీవో నం.84 ప్రకారం అర్బన్ ల్యాండ్‌సీలింగ్ భూముల క్రమబద్ధీకరణకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.
- వైకాపా ప్రభుత్వం తొలగించిన భూములు, ఇనాం భూములు తదితర భూములపై రీ-సర్వే ద్వారా అవకతవకలు వెలుగు చూసినట్లు మంత్రి పేర్కొన్నారు.
మరిన్ని మంత్రివర్గ నిర్ణయాలు
- సొసైటీ ద్వారా విరాళాల సేకరణ:
నాగావళి నదిపై 3.7 మెగావాట్ల జలవిద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటుకు అనుమతి.
చిన్న విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఎస్‌హెచ్‌జీలకు ప్రోత్సాహం. - రిటైనింగ్ వాల్ నిర్మాణం:
కృష్ణానదికి వరదల సమయంలో ముంపు నివారణకు తాడేపల్లి వైపు మరో రిటైనింగ్ వాల్ నిర్మాణానికి రూ.294 కోట్ల ఆమోదం. - ఆధునిక పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి:
వైఎస్సార్ జిల్లా కొప్పర్తి మండలంలో 2,595 ఎకరాలు, కర్నూలు జిల్లా ఓర్వకల్లు పరిధిలో 2,661 ఎకరాలను ఏపీఐఐసీకి బదిలీ చేసేందుకు నిర్ణయం.





