గూగుల్ తన కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ‘డీప్ రీసెర్చ్’ ను ప్రారంభించింది. ఇది ఇంటర్నెట్‌లో మీకు కావాల్సిన ఏదైనా సమాచారాన్ని చాలా సులభంగా కనుగొనడంలో మీకు సహాయపడుతుంది. ఇది గూగుల్ జెమిని AI మోడల్‌పై ఆధారపడి పని చేస్తుంది. మీరు డీప్ రీసెర్చ్‌లో ఏదైనా ప్రశ్నను అడిగితే, అది ఇంటర్నెట్‌లో విస్తృతంగా శోధించి మీ ప్రశ్నకు సమాధానం కనుగొనడానికి ప్రయత్నిస్తుంది. ఉదాహారణకు, మీరు ” స్కాలర్‌షిప్‌లు ఎలా పొందాలి?” అని అడిగితే, డీప్ రీసెర్చ్ వివిధ వెబ్‌సైట్‌లను, బ్లాగులను, వార్తా కథనాలను శోధించి కావాల్సిన అధికారిక సమాచారాన్ని అందిస్తుంది. అంతేకాకుండా, ఈ సమాచారాన్ని ఒక నివేదిక రూపంలో అందించి, మీకు అర్థమయ్యేలా వివరించి చెబుతుంది. ప్రస్తుతం, డీప్ రీసెర్చ్ సేవను ఉపయోగించాలంటే గూగుల్ జెమినై అడ్వాన్స్‌డ్ ప్లాన్‌కు సభ్యత్వం తీసుకోవాలి. ఈ సేవ ప్రస్తుతం ఇంగ్లీష్ భాషలో మాత్రమే అందుబాటులో ఉంది. డీప్ రీసెర్చ్ అనేది గూగుల్జె జెమిని 2.0 ప్రాజెక్ట్‌లో భాగం. జెమిని ఇంటర్నెట్‌లో స్వతంత్రంగా పనిచేయగల AI సిస్టమ్.





