- ‘గజిని’ సీక్వెల్‌పై నిర్మాత అల్లు అరవింద్ స్పందన
- సూర్య, ఆమిర్ ఖాన్ కలిసి సీక్వెల్ చేయనున్నారా?
సినీ ప్రియులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ‘గజిని’ (Ghajini) సీక్వెల్‌పై నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముంబయిలో జరిగిన ‘తండేల్’ హిందీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఆయన మాట్లాడుతూ, “గజిని’ టైమ్‌లోనే ఆమిర్ ఖాన్ రూ.100 కోట్లు రాబట్టే మూవీ అవుతుందని ఛాలెంజ్ చేశారు. ఇప్పుడు అదే 1000 కోట్ల టార్గెట్‌గా ఓ సినిమా తీస్తే బాగుంటుంది. అది ‘గజిని 2’ అయ్యే అవకాశముంది” అని తెలిపారు.
“హిందీ – తమిళంలో ఒకేసారి ‘గజిని’ సీక్వెల్?”
సూర్య నటించిన తమిళ ‘గజిని’ (Ghajini Tamil) ను హిందీలో ఆమిర్ ఖాన్‌తో రీమేక్ చేసిన విషయం తెలిసిందే. ఇటీవల సూర్య కూడా ‘గజిని 2’ ఉంటుందని హింట్ ఇచ్చారు. కోలీవుడ్ సమాచారం ప్రకారం, ‘గజిని 2’ను తమిళంలో సూర్యతో, హిందీలో ఆమిర్ ఖాన్‌తో తెరకెక్కించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేగాక, ఇద్దరూ ఒకరి సినిమాలో అతిథిగా కనిపించే ఛాన్స్ ఉందని టాక్. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.






