హ్యాపీ జర్నీ: మ్యాప్ ల్లో మస్తీ ఫీచర్స్.. ఇక మీ ప్రయాణం మరింత స్మార్ట్!!!

వచ్చేదంతా పండగలు.. హాలిడేస్ సీజన్. టూర్లు ప్లాన్ చేస్తుంటారు.. ఈ క్రమంలో ఎక్కడికైనా వెళ్తే.. ‘అమ్మో కొత్త చోటు.. కొత్త భాష.. ఇప్పుడు అడ్రస్ ఎలా కనుక్కోవాలి? ఎవరిని అడగాలా?’ అని సందేహించడం. తీరగా అడిగాక ‘రైట్ తస్కో.. లెప్ట్ తీస్కో.. స్ట్రైట్ గా వెళ్లిపో..’  అంటూ  చెబుతుండగానే కన్ఫ్యూజన్ లో దారి మర్చిపోవడం!! ఇదంతా ఒకప్పటి రోజుల్లో.. ఇప్పుడు సింపుల్ గా జేబులో నుంచి ఫోన్ తీయడం. గూగుల్ మ్యాప్ ఓపెన్ చేయడం.. ఏ కన్ఫ్యూజన్ లేకుండా కావాల్సిన అడ్రస్ కి వెళ్లిపోతున్నాం. కారులో అయినా.. కాలి నడకనైనా.. గూగుల్ మ్యాప్ లనే రాజమార్గంగా వాడేస్తున్నాం.  అంతలా ప్రయాణాల్ని సౌకర్యవంతంగా మార్చేసిన గూగుల్ సరికొత్త సౌకర్యాల్ని అందిస్తోంది. ఆయా స్మార్ట్ సౌకర్యాల్ని వాడుకుని ట్రావెల్ ని మరింత సుఖమయం చేసుకోవచ్చు. ఏఐతో అందించనున్న ఆయా ఫీచర్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.. వీటిని ఆండ్రాయిడ్, ఐఓఎస్ డివైజ్ ల్లో ఒక్కొక్కటి గా గూగుల్ మ్యాప్స్ లో అప్ డేట్స్ రూపంలో పొందొచ్చు. 

సందుల్లోకి వెళ్లకుండా.. 
రూట్ మ్యాప్ ని పెట్టేసుకోవడం… ‘స్టార్ట్’ నొక్కేసి స్టీరింగ్ పట్టుకోవడం. మ్యాప్ ని బ్లైండ్ గా ఫాలో అయిపోవడం. కొన్ని సార్లు మ్యాప్ చూపిస్తుంది కదా అని..   ఇరుకు సందుల్లోకి వెళ్లిపోవడం.. కారు పట్టక వెనక్కి తిప్పడం కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది.  అందుకే గూగుల్ ఏఐ టెక్నాలజీతో కార్లు వెళ్లడానికి వీలు లేని సందు, గొందుల్ని గుర్తించే వెసులుబాటు తేనుంది. మనం వెళ్లే దారిలో కారు వెళ్లేందుకు వీలు లేని సందులు ఏమైనా ఉంటే ఏఐ ముందే గుర్తించి దారి మళ్లిస్తుంది. ఇప్పటికైతే ఈ సదుపాయం కొన్ని ప్రధాన నగరాల్లో మాత్రమే అందుబాటులోకి తేనుంది. 

ఫ్లైఓవర్ నావిగేషన్
కొన్ని ప్రధాన నగరాల్లో ఫ్లైఓవర్లు చాలా పెద్దగా ఉంటాయి. అనుకోకుండా ఆ బ్రిడ్జ్ గనుక ఎక్కాం అంటే చాలు.. చేరుకోవాల్సిన చోటుకి ఆలస్యం అవుతుంది.  పైనే ట్రాఫిక్ జామ్ అవ్వొచ్చు.. వేరే డైవర్షన్ తీసుకోవడానికి వీలుండదు. అందుకే.. మనం వెళ్లే రూటులో ఏదైనా ఫ్లైఓవర్ ఉంటే ముందే తెలుసుకునేలా ‘ఫ్లైఓవర్ నావిగేషన్’ సదుపాయం మ్యాప్స్ లోకి రానుంది. దీంతో ముందు గుర్తించి డ్రైవ్ ని ప్లాన్ చేయొచ్చు. ఇప్పటికైతే దేశ వ్యాప్తంగా 40 ప్రధాన నగరాల్లో గుగూల్ మ్యాప్స్ లో బ్రిడ్జ్ లను హైలైట్ చేసి చూపిస్తుంది. 

మెట్రో టిక్కట్లు కూడా.. 
ప్రధాన నగరాల్లోని మెట్రో సేవల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే యూజర్లు మ్యాప్స్ నుంచే మెట్రో టిక్కట్లు బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. సో.. పర్యాటకులు ఇతర బుకింగ్ యాప్స్ ని ఇన్ స్టాల్ చేసుకోవాల్సన అవసరం లేదు. 

ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు
ఎలక్ట్రిక్ కార్లు, బైక్ లు ఎక్కువగా మార్కెట్ లోకి వస్తున్నాయ్. దీంతో ‘ఈవీ చార్జింగ్ స్టేషన్లు’ కూడా పెరుగుతున్నాయ్. ఈ నేపథ్యంలో మ్యాప్స్ లోనే చార్జింగ్ స్టేషన్ల వివరాల్నిపొందొచ్చు. సుమారు దేశ వ్యాప్తంగా 8000 చార్జింగ్ స్టేషన్ల లొకేషన్స్ ని మాప్స్ లో పొందుపరిచింది.  దీంతో మ్యాప్స్ లో మీ వాహనానికి తగిన ఫిల్లింగ్ స్టేషన్ ని రియల్ టైమ్ లో చూడొచ్చు.  ద్విచక్ర వాహనాల ఈవీ చార్జింగ్ స్టేషన్స్ ని కూడా గూగుల్ మ్యాప్స్ లో చూడొచ్చు. 

లోకల్ అనిపించుకునేలా..
పర్యాటకంలో ఎక్కడికి వెళ్లినా.. ఆ ప్రాంతంలో ఉన్న అన్ని ముఖ్యమైన స్పాట్స్ కి చూసేందుకు  ప్రయత్నిస్తాం. అందుకే గూగుల్ లోకల్ వాళ్లతో జట్టుకట్టింది. ముఖ్య నగరాల్లో ఆయా టూరిస్ట్ స్పాట్స్ గురించి తెలుసుకునేలా మ్యాప్స్ లో వివరాల్ని పొందుపరిచింది. అక్కడే వెతికి చూడొచ్చు.  ఎలా వెళ్లాలి? ఎక్కడ స్టే చేయాలి? ట్రాన్స్ పోర్ట్ వివరాలు పొందొచ్చు. 

యూజర్లలో సంయుక్తంగా.. 
మనం ఏ ప్రాంతాన్ని సందర్శించిన తర్వాత అక్కడ ఎదురైన పరిస్థితుల్ని ఇతరులతో పంచుకుంటాం.  ఇదే మాదిరిగా గూగుల్ మ్యాప్స్ లో నూ మీరు తిరిగిన చోటు గురించి చెప్పొచ్చు.  ఆయా రూట్ల కు సంబంధించిన వివరాల్ని మ్యాప్స్ లో జత చేయొచ్చు. దీంతో ఇతరులు  ఎవరైనా ఆయా రూట్ మ్యాప్స్ లను వెతికే క్రమంలో ఆ వివరాల్ని కూడా చూసేందుకు వీలవుతుంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే.. ఈ ‘రోడ్  ఇన్సడెంట్స్’ ని రిపోర్ట్ చేయొచ్చు.

గూగుల్ ఎర్త్ లో ‘టైమ్ ట్రావెల్’
ఓ ప్రాంతానికి వెళ్లకుండానే.. అక్కడ వీధుల్లో తిరుగుతూ ఓ అవగాహనకి వచ్చేయొచ్చు. ‘స్ట్రీట్ వ్యూ’ నే అందుకు ఉదాహరణ.  అయితే, దీంట్లో యూజర్లు ఏకంగా 80 ఏళ్ల వెనక్కి వెళ్లి  ఆయా ప్రాంతాల్ని స్ట్రీట్ వ్యూలో చూడొచ్చు. ఏ విధంగా అక్కడ మార్పులు చోటు చేసుకున్నాయో విశ్లేషించొచ్చు. ప్రకృతి సిద్ధంగా చోటు చేసుకున్న మార్పుల్ని చాలా స్పష్టంగా చూడొచ్చు. ఏఐ టెక్నాలజీతో ఆయా ప్రాంతాల స్ట్రీట్ వ్యూ ని మరింత మెరుగ్గా చూసేందుకు వీలుంటదని గూగుల్ మ్యాప్స్ నిర్వాహకులు చెబుతున్నారు. 

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మీ బిజినెస్ ని ఇక్కడ ప్రమోట్ చేస్కోండి !

Your Ads Here (365 x 270 area)
Breaking News
కేటగిరి

మా న్యూస్ అప్డేట్లు కోసం సబ్‌స్క్రైబ్ చేయండి!

Everyday we discover real news for you.