- గూగుల్ తన కొత్త పిక్సెల్ 10 సిరీస్‌లో శాటిలైట్ కాలింగ్ ఫీచర్‌ను లాంచ్ చేసింది.
- ఈ ఫీచర్ ద్వారా సిగ్నల్ లేని ప్రాంతాల్లో కూడా వాట్సాప్ కాల్స్ చేసుకోవచ్చు.
- ఈ టెక్నాలజీతో ప్రపంచంలోనే తొలిసారిగా వాట్సాప్ శాటిలైట్ కాలింగ్ అందించే ఫోన్‌గా పిక్సెల్ 10 నిలవనుంది.
మనం ఎక్కడైనా టూర్లకు లేదా ప్రయాణాలకు వెళ్లినప్పుడు సిగ్నల్ లేక ఫోన్ మాట్లాడలేక ఇబ్బంది పడుతుంటాం. ఆ సమస్యకు పరిష్కారంగా గూగుల్ ఒక సరికొత్త టెక్నాలజీని తీసుకొచ్చింది. గూగుల్ పిక్సెల్ 10 సిరీస్ ఫోన్లలో శాటిలైట్ కమ్యూనికేషన్ ఆధారంగా పనిచేసే ఫీచర్‌ను జోడించింది. ‘మేడ్ బై గూగుల్’ ఈవెంట్‌లో గూగుల్ ఈ ఫీచర్‌ను అధికారికంగా ప్రకటించింది. ఆగస్టు 28 నుంచి ఈ ఫీచర్ పిక్సెల్ 10 సిరీస్ ఫోన్లలో అందుబాటులోకి వస్తుంది.
ఎలా పని చేస్తుంది?
గూగుల్ పిక్సెల్ 10 వాడేవారు సిగ్నల్ లేదా వైఫై లేని ప్రాంతంలో ఉన్నప్పుడు, ఫోన్ స్క్రీన్ పై ఒక శాటిలైట్ ఐకాన్ కనిపిస్తుంది. ఆ సమయంలో మీరు వాట్సాప్ వాయిస్ లేదా వీడియో కాల్ చేస్తే, అది నేరుగా శాటిలైట్ నెట్‌వర్క్ ద్వారా కనెక్ట్ అవుతుంది. సాధారణ కాల్స్ లాగానే ఇది పనిచేస్తుంది. ఈ టెక్నాలజీ విజయవంతమైతే, వాట్సాప్ ద్వారా శాటిలైట్ కాలింగ్‌ను అందించే మొదటి స్మార్ట్‌ఫోన్‌గా గూగుల్ పిక్సెల్ 10 నిలుస్తుంది. అయితే, ఈ సేవలు కొన్ని ఎంపిక చేసిన టెలికాం సంస్థల ద్వారా మాత్రమే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా, ఈ ఫీచర్‌ను వాడినందుకు అదనపు ఛార్జీలు కూడా చెల్లించాల్సి రావచ్చని తెలుస్తోంది.





