
కొన్నిరోజుల క్రితం ‘పుష్ప 2’ ప్రమోషన్ కోసం ముంబై వెళ్లిన అల్లు అర్జున్, బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ గురించి మాట్లాడారు. “అమితాబ్ ఒక లెజెండ్. ఈ వయసులోనూ అద్భుతంగా పనిచేస్తూ అందరినీ ఎంటర్‌టైన్ చేస్తున్నారు” అని ఆయన అన్నారు. అల్లు అర్జున్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు అమితాబ్ కంటపడ్డాయి.ఈ నేపథ్యంలో, అమితాబ్ బచ్చన్ ట్విట్టర్ ద్వారా అల్లు అర్జున్‌ని ప్రశంసిస్తూ స్పందించారు. “అల్లు అర్జున్ గారు.. మీ మాటలు నా మనసుని తాకాయి. నా అర్హత, స్థాయిని మించి మీరు పొగిడేస్తున్నారేమో అనిపించింది,” అని ఆయన పేర్కొన్నారు.”మీ పనితనం, మీ ప్రతిభకు మేమంతా అభిమానులం. మీరు మా అందరినీ ఇన్‌స్పైర్ చేస్తూనే ఉండాలి. ఇలానే విజయాలు సాధిస్తూ ఉండాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను” అని అమితాబ్ రాసుకొచ్చారు.ఈ ప్రశంసలకు అల్లు అర్జున్ ఏమని రిప్లై ఇస్తాడో చూడాలి. ఈ సంఘటన రెండు తరం నటుల మధ్య ఉన్న గౌరవాన్ని మరియు స్నేహాన్ని చూపిస్తుంది.





