ఒక్క చార్జింగ్‌తో 40 గంటల ప్లేబ్యాక్ టైమ్‌ను అందిస్తుంది. కేవలం పదే నిమిషాలు చార్జింగ్ పెట్టి 180 నిమిషాల పాటు బడ్స్ ని వాడుకోవచ్చు.
ఎవరి చెవుల్లో చూసినా వైర్ లెస్ బడ్స్. కాల్స్ మాట్లాడడానికైనా.. మ్యూజిక్ మస్తే చేసేందుకైనా.. చెవులకు ఈ స్మార్ట్ పుల్లలు తగిలించేస్తున్నారు. గ్యాడ్జెట్ తయారీ కంపెనీలు కూడా వీటి తయారీపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నాయి. ఐ టెల్ కూడా వినూత్నమైన సౌకర్యాలతో దేశీయ మార్కెట్లో కొత్తగా Itel Buds Ace ANC ట్రూవైర్లెస్ ఇయర్‌ఫోన్స్ లాంచ్ చేసింది. కమ్యూనికేషన్, వినోదం, గేమింగ్ వంటి అనేక అవసరాలకు తగిన తగిన విధంగా ఈ బడ్స్ ని రూపొందించారు. నాణ్యమైన సౌండ్ అనుభవం కోసం ఇదొక చక్కని ఎంపిక. బడ్జెట్ ధరలోనే అడ్వాన్స్‌డ్ ఫీచర్లను అందించే ఈ ఇయర్‌బడ్స్ మ్యూజిక్ ప్రియుల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేశారు. నాయిస్ క్యాన్సిలేషన్, ఎక్కువ బ్యాటరీ లైఫ్, మంచి ఆడియో క్వాలిటీ ఇవి అందించే ముఖ్యమైన ఫీచర్స్. అడ్వాన్స్‌డ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC)తో బయటి శబ్దాల్ని 22 డిసిబెల్స్ వరకు తగ్గిస్తుంది. దీంతో యూజర్లు ఆడియోని చక్కగా వినచ్చొు. నార్మల్, గేమింగ్, మరియు మ్యూజిక్ మోడ్స్‌తో బడ్స్ ని వాడుకోవచ్చు. అంటే.. అవసరాలకు తగిన విధంగా కస్టమైజ్ చేసుకునే వీలుంది. చక్కని డిజైన్ తో చెవుల్లో చక్కగా ఇమిడిపోతాయి. ఒక్క చార్జింగ్‌తో 40 గంటల ప్లేబ్యాక్ టైమ్‌ను అందిస్తుంది. కేవలం పదే నిమిషాలు చార్జింగ్ పెట్టి 180 నిమిషాల పాటు బడ్స్ ని వాడుకోవచ్చు. * ధర: రూ.1,399






