తమిళనాడులోని సేలంకు చెందిన మల్లికకు చనిపోయిన మొదటి భర్త ఆస్తిలో భాగస్వామ్యం కల్పిస్తూ మద్రాసు హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. హిందూ వివాహ చట్టం ప్రకారం, భర్త మరణానంతరం భార్య పునర్వివాహం చేసినా, ఆమెకు మొదటి భర్త ఆస్తిలో హక్కు ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది.సేలం సివిల్ కోర్టు మల్లిక పిటిషన్‌ను కొట్టివేయడంతో, ఆమె హైకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ సుబ్రమణియన్, జస్టిస్ కుమరప్పన్ ధర్మాసనం ఈ కేసును విచారించింది. హిందూ వివాహ చట్టం 1955 ప్రకారం, భర్తను కోల్పోయిన భార్యకు ఆస్తిలో వాటా లేదని పేర్కొనే సెక్షన్‌ను 2005లోనే రద్దు చేశారని న్యాయమూర్తులు గుర్తు చేశారు. దాంతో మల్లికకు ఆస్తులను అప్పగించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.ఈ తీర్పు హిందూ మహిళల ఆస్తి హక్కుల పరిరక్షణలో ముఖ్యమైన అడుగుగా అభివర్ణించబడుతోంది.






