- విజయశాంతి పవర్‌ఫుల్ రీ-ఎంట్రీ
- తల్లి-కొడుకు మధ్య ప్రేమ, వైరం, ఎమోషన్ మేళవించిన కథ
నందమూరి కల్యాణ్ రామ్, ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ మూవీతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సాయి మంజ్రేకర్ కథానాయికగా, విజయశాంతి ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. తాజాగా విడుదలైన టీజర్ సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది.
విజయశాంతి పోలీసాఫీసర్‌గా పవర్‌ఫుల్ రీ-ఎంట్రీ
టీజర్ చూస్తే, తల్లి-కొడుకు మధ్య ప్రేమ, వైరం, సెంటిమెంట్ కలిపిన ఎమోషనల్ డ్రామాగా సినిమా తెరకెక్కినట్లు స్పష్టమవుతోంది. విజయశాంతి, పవర్‌ఫుల్ పోలీసాఫీసర్‌గా కనిపిస్తుండగా, కల్యాణ్ రామ్ ఆమె కొడుకుగా నటిస్తున్నాడు. 1990లో విజయశాంతి నటించిన ‘కర్తవ్యం’లో వైజయంతి పాత్రకు కొడుకు ఉంటే ఎలా ఉండేది? అనే ఆసక్తికరమైన పాయింట్ ఆధారంగా ఈ కథ తయారైనట్లు తెలుస్తోంది. ఎంతో ప్రేమగా ఉండే తల్లి-కొడుకులు ఎందుకు దూరమయ్యారు?, వారి మళ్లీ కలయిక ఎలా జరిగింది? అనే మిస్టీరియస్ స్టోరీలైన్‌ను టీజర్ హింట్ ఇస్తోంది.





