అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీవో జవహర్‌బాబుపై జరిగిన దాడి గురించి తెలిసిందే. ప్రస్తుతం కడప రిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆయనను ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పరామర్శించి, దాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ దాడిని తీవ్రంగా ఖండించిన పవన్ మీడియాతో మాట్లాడుతూ, ‘‘ఇలాంటి ఘటనలను సహించబోము. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని హెచ్చరించారు. పవన్ కల్యాణ్‌ను చూడటానికి ఆసుపత్రికి చేరుకున్న అభిమానులు పవన్ మీడియాతో మాట్లాడుతున్న సమయంలో ‘‘ఓజీ.. ఓజీ..’’ అంటూ స్లోగన్లు చేయడం ఆయనకు అసహనంగా మారింది. ‘‘ఏంటయ్యా మీరు, ఎప్పుడు ఏ స్లోగన్ చెప్పాలో తెలియదు. పక్కకు రండి’’ అని కోప్పడ్డారు. రాజకీయ కార్యక్రమాలతో పాటు, పవన్ తన సినీ ప్రాజెక్టులను కూడా సమన్వయం చేస్తున్నారు. ‘ఓజీ’: యాక్షన్ థ్రిల్లర్‌గా సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ‘హరిహర వీరమల్లు’: ఈ పీరియాడిక్ చిత్రం పనులను కూడా వీలుకుదిరినప్పుడల్లా పూర్తి చేస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై దానయ్య ఈ చిత్రాలను నిర్మిస్తున్నారు





