- “లాజిక్ కంటే నమ్మకమే ముఖ్యం” – రాజమౌళి, సందీప్ రెడ్డి వంగా, అనిల్ శర్మపై ఆసక్తికర వ్యాఖ్యలు .. “దర్శకుడికి కథపై నమ్మకం ఉంటే బ్లాక్‌బస్టర్ ఖాయం”
బాలీవుడ్ స్టార్ నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్ సినిమా విజయం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కథలో లాజిక్ కంటే నమ్మకమే ముఖ్యం అని, దర్శకుడికి కథపై పట్టు ఉంటే ప్రేక్షకులు లాజిక్ గురించి ఆలోచించరని అన్నారు. “రాజమౌళి సినిమాలు తీసుకుంటే, ఎవరూ లాజిక్ గురించి మాట్లాడరు. ఎందుకంటే ఆయన కథపై పూర్తి నమ్మకంతో ఉంటారు. ప్రేక్షకులు కూడా అదే నమ్ముతారు” అని కరణ్ పేర్కొన్నారు. కరణ్ జోహార్ ఉదాహరణగా ‘ఆర్‌ఆర్‌ఆర్’, ‘యానిమల్’, ‘గదర్ 2’ సినిమాలను ప్రస్తావించారు. “గదర్ 2లో సన్నీ దేవోల్ ఒక హ్యాండ్ పంప్‌తో వేల మందిని కొడతారు. ఇది లాజికల్‌గా సాధ్యమా? కానీ దర్శకుడు అనిల్ శర్మ నమ్మాడు, ప్రేక్షకులూ నమ్మారు. అందుకే హిట్ అయ్యింది” అని చెప్పారు. “సినిమాను ఎంజాయ్ చేయడానికే చూడాలి. లాజిక్ గురించి ఆలోచించడం ఫలితం లేదు” అని కరణ్ స్పష్టం చేశారు. 1998లో ‘కుచ్ కుచ్ హోతా హై’ తో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన కరణ్ జోహార్, ధర్మ ప్రొడక్షన్స్‌ను స్థాపించి ప్రముఖ నిర్మాతగా ఎదిగారు. ప్రస్తుతం ‘ధడక్ 2’ సినిమాతో బిజీగా ఉన్నారు.





