
కేఎల్ రాహుల్ (KL Rahul) ప్రదర్శన బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భారత జట్టుకు పెద్ద బలంగా నిలిచింది. గబ్బా టెస్టులో నిలకడగా ఆడి, ఫాలోఆన్ ముప్పు నుంచి జట్టును గట్టెక్కించాడు. తక్కువ పరుగులకే వికెట్లు కోల్పోతున్న సమయంలో రాహుల్ విలువైన 84 పరుగులు సాధించాడు. బంతి పాతబడకముందే భారత బ్యాటర్లు ఆతృతగా ఆడటంతో పలు వికెట్లు కోల్పోయారు. కానీ రాహుల్ మాత్రం స్మార్ట్ ఆటతీరు ప్రదర్శించాడు. ఆస్ట్రేలియా ఆటగాడు స్మిత్ 128 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసి, అంచెలంచెలుగా శతకాన్ని సాధించాడు. రాహుల్ కూడా అదే విధంగా ఎంపిక చేసిన బంతులకే షాట్లు ఆడి, జడ్డూ సహకారంతో జట్టును గౌరవప్రదమైన స్కోర్ వైపు తీసుకెళ్లాడు. ఆసీస్ బౌలర్ల బలాన్ని తెలుసుకుని, అనవసర షాట్లకు పోకుండా ఫుట్‌వర్క్‌తో సరైన నిర్ణయాలు తీసుకున్నాడు.
వివిధ ఆటగాళ్లతో పోల్చితే రాహుల్ ప్రత్యేకత
సెనా దేశాల్లో (సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) 2020 నుంచి రాహుల్ సగటు 41.5 తో బ్యాటింగ్ చేస్తూ నిలకడగా రాణిస్తున్నాడు. విరాట్ (30.4), పంత్ (34.8), రోహిత్ (33.2) కంటే మెరుగైన ప్రదర్శన అతనిది. ఒత్తిడిలోనూ జట్టును నిలబెట్టగల సామర్థ్యం రాహుల్‌కు ప్రత్యేకత. గబ్బా టెస్టులో అతడు చూపిన సహనం, ఒత్తిడిలో సమయస్ఫూర్తితో ఆడిన బాట యువ క్రికెటర్లకు పాఠంగా నిలుస్తుంది.






