బాక్సింగ్ డే టెస్టులో ఆసీస్ యువ ఓపెనర్ సామ్ కాన్‌స్టాస్, టీమిండియా ఆటగాడు విరాట్ కోహ్లీ మధ్య చిన్నపాటి వాగ్వాదం చోటుచేసుకుంది. 11వ ఓవర్‌లో బుమ్రా బౌలింగ్ తర్వాత బాల్‌ను తీసుకుని నాన్‌స్ట్రైకర్ ఎండ్ వైపు నడుస్తున్న కోహ్లీ, స్ట్రైకింగ్ క్రీజ్ వైపు వెళ్తున్న కాన్‌స్టాస్‌తో భుజాలు తాకాడు. ఈ సంఘటనతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం మొదలైంది. అంపైర్లు, ఉస్మాన్ ఖవాజా మధ్యవర్తిత్వం వహించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఈ ఘటనపై మాజీ ఆటగాళ్ల రికీ పాంటింగ్, మైకెల్ వాన్‌లు కోహ్లీ తీరు అనుచితమని వ్యాఖ్యానించారు. ఐసీసీ నిబంధనల ప్రకారం, ఆటగాడి చెడు ప్రవర్తనపై చర్యలు తీసుకోవచ్చు. 2.12 ఆర్టికల్ ప్రకారం ఇలాంటి ఘటనలు శిక్షార్హం. మ్యాచ్ నిషేధం లేదా డీమెరిట్ పాయింట్ల విధింపు జరగవచ్చు. కాగా, కోహ్లీ ఉద్దేశపూర్వకంగా చేసాడా లేదా అన్నది విచారణ అనంతరం తేలుతుంది. ఈ ఘటనతో ఆటగాళ్ల ప్రవర్తనపై, ఐసీసీ నిబంధనల ప్రయోగంపై క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి రేగింది.





