టీడీపీ, బీజేపీ మద్దతుతో నాగబాబు నామినేషన్ దాఖలు.. రిటర్నింగ్ అధికారి వనితారాణికి నామినేషన్ పత్రాలు అందజేత.. అధికారికంగా అభ్యర్థిత్వ ప్రక్రియ!!
ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు. ఆయన అభ్యర్థిత్వానికి మద్దతుగా టీడీపీ నేతలు మంత్రి నారా లోకేశ్, రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు హాజరయ్యారు. రిటర్నింగ్ అధికారి వనితారాణికి నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు నారా లోకేశ్, నాదెండ్ల మనోహర్, పల్లా శ్రీనివాసరావు, కొణతాల రామకృష్ణ, విష్ణుకుమార్ రాజు, బొలిశెట్టి శ్రీనివాస్ హాజరయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియలో నాగబాబు పేరు అధికారికంగా ముందుకు రావడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది.





