సాధారణ రైళ్ల కంటే ప్రత్యేక రైళ్ల టికెట్ ధరలు 13% నుంచి 20% అధికంగా నిర్ణయం. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 181 ప్రత్యేక రైళ్లు, హైదరాబాద్ నుంచి అధిక యాత్రికుల రాకపోకలు
మహా కుంభమేళాకు భారీగా తరలి వెళుతున్న భక్తులపై రైల్వే శాఖ అదనపు భారం మోపుతోంది. ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నప్పటికీ, టికెట్ ధరలను 13% నుంచి 20% వరకు పెంచడంతో యాత్రికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెగ్యులర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లతో పోల్చితే, ప్రత్యేక రైళ్ల స్లీపర్, త్రీటైర్ ఏసీ, టూ టైర్ ఏసీ టికెట్లపై అధిక చార్జీలు విధించారు. హిందూ సంఘాలు ఈ అదనపు భారం తగ్గించాలని రైల్వే అధికారులను కోరుతున్నాయి. పండుగలు, మహోత్సవాల సమయంలో ప్రయాణికులకు రాయితీ ధరలు అందించాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది.






