సూపర్‌స్టార్ మహేశ్‌బాబు కథానాయకుడిగా, ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న భారీ యాక్షన్ అడ్వెంచర్ మూవీ (#SSMB29) సినిమాపై అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్న ఈ చిత్రానికి సంబంధించి, రాజమౌళి ఓ ఆసక్తికర వీడియో పంచుకున్నారు. సింహాన్ని లాక్ చేసినట్లు సంకేతాలు ఇచ్చిన ఈ వీడియోకు ‘క్యాప్చర్’ అనే క్యాప్షన్ జోడించారు. మహేశ్ బాబు ఈ వీడియోపై ‘‘ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను’’ అంటూ తన పోకిరి డైలాగ్‌ను కామెంట్ చేశారు. మరోవైపు బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ‘‘ఫైనల్లీ’’ అంటూ నవ్వుల ఎమోజీతో స్పందించారు. దీంతో ఈ సినిమాలో ఆమె హీరోయిన్‌గా ఫిక్స్ అయినట్లు టాక్ వినిపిస్తోంది.
అంతర్జాతీయ స్థాయి ప్రాజెక్ట్
ఈ సినిమా కథ అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామాగా ఉండనుందని సమాచారం. జక్కన్న ఇప్పటికే మహేశ్‌కు సంబంధించి ఎనిమిది లుక్స్‌ను డిజైన్ చేశారని వార్తలు వెలువడుతున్నాయి. సినిమాలో జంతువులు ప్రధాన పాత్ర పోషించనున్నాయి. ఇది ‘ఆర్‌ఆర్‌ఆర్’లో ఉన్న జంతువులకు మించిన ప్రాముఖ్యతను అందిస్తుందని రాజమౌళి వెల్లడించారు. ఇప్పటికే ‘గరుడ’ అనే టైటిల్‌ను పరిశీలనలో ఉంచగా, ఈ సినిమా భారతీయ భాషలతో పాటు అనేక విదేశీ భాషల్లోనూ విడుదల కానుంది. మహేశ్ బాబు, రాజమౌళి కాంబోలో వస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రారంభం గురించి మరిన్ని వివరాలు త్వరలో వెలుబడనున్నాయి.






