మన్మోహన్‌సింగ్ కెరీర్ ఆరంభం ఒక సాధారణ ఆర్థిక శాస్త్ర అధ్యాపకుడిగా జరిగింది. పంజాబ్ యూనివర్సిటీ, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో ఆయన లెక్చరర్‌గా పని చేశారు. ఆర్థిక శాస్త్రం, విధానాలపై లోతైన అవగాహనతో విద్యార్థులకు ఉత్తమ బోధన అందించారు. 1966–69 మధ్య కాలంలో ఐక్యరాజ్యసమితి (ఐరాస)లో పనిచేసిన మన్మోహన్‌సింగ్, ఆ తర్వాత అనుకోకుండా బ్యూరోక్రాట్‌గా మారారు.
వాణిజ్య మరియు పరిశ్రమల శాఖలో ఆర్థిక సలహాదారుగా తొలుత పనిచేశారు.
1972–76 మధ్య కేంద్ర ఆర్థిక శాఖలో ప్రధాన ఆర్థిక సలహాదారుగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఆర్థిక వ్యవస్థ ఆధునీకరణలో కీలక పాత్ర.. 1982–85 మధ్య కాలంలో రిజర్వు బ్యాంక్ గవర్నర్‌గా పనిచేశారు. ఆ తర్వాత ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్మన్‌గా (1985–87) దేశ ఆర్థికవ్యవస్థను ఆధునీకరించడంలో ఆయన మరింత దోహదపడ్డారు. ఆయన బాధ్యతలపరమైన అనుభవం పలు కీలక ఆర్థిక విధానాల రూపకల్పనకు మార్గనిర్దేశం చేసింది. దేశ ఆర్థిక వ్యవస్థను ఆధునీకరణ దిశగా నడిపిన విధానాలు, వ్యవహారశైలి ఆయనకు అగ్రగామి స్థానాన్ని కల్పించాయి. ఆర్థికమంత్రిగా, రిజర్వు బ్యాంక్ గవర్నర్‌గా, ప్రణాళిక సంఘం సభ్యునిగా మన్మోహన్ సింగ్ అందించిన సేవలు దేశ ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాది లాంటివి.





